నీహారికా,
ఒకసారి మనం ఒక జాబ్ లో చేరాక ముందరగా ఆ జాబ్ లో వంద శాతం సరిగ్గా ఇమిడి పోయమో లేదో ఇంకా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవలసిన అవసరం వుందా అని ఆలోచించుకోవాలి. చాలా విషయాల్లో ఉద్యోగాన్ని, వ్యక్తిగత సంబందాలను అస్సలు కలుపుకోకూడదు. ఉదాహరణకు మనం మన ఆఫీస్ లో మనకు తెలిసిన వేరెవరికో రికమండ్ చేస్తున్నాం అనుకో, ముందుగా ఆ వ్యక్తి ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకవేళ వ్యక్తిగతమైన ఇష్టంతో సిఫార్స్ చేస్తే ఆ ప్రభావం మన ఉద్యోగం పైన కూడా పడుతుంది. ఇంతకు ముందు ఇంకో ఆఫీసులో కలిసి పని చేసమనుకో అప్పుడయినా వారితో మనకుండే స్నేహం, బంధుత్వం ఆధారంగా కాక వారిలో మనకు నచ్చిన పనితీరును సిఫార్స్ వేళ పరిగణలోకి తీసుకోవాలి. ఏం చేయలన్నా కంపెనీ నిబంధనలు, రిఫరెన్స్ లను గుర్తు పెట్టుకుని హెచ్.ఆర్. విభాగాన్ని సంప్రదించాలి. ఉద్యోగం చేస్తున్నంత కాలం ముందుగా మన బలాలు, బలహీనతలు గుర్తులో ఉంచుకుని ఇంప్రూవ్ మెంట్ కోసం ప్రయత్నాలు చేయాలి గానీ అశ్రద్ధగా మాత్రం ఉండకూడదు.