అమ్మాయిలు మహిళలు కూడా సాధారణంగా ఎదుర్కునే సమస్యల్లో మూత్ర నాళ ఇన్ఫెక్షన్ ముఖ్యం. వైద్యుల్ని సంప్రదించినా రోజువారీ కొంత పర్సనల్ శ్రద్ధ తీసుకుంటే ఈ సమస్య నుంచి తేలికగా బయట పడవచ్చు. ఆఫిసుల్లో పనిచేయటం మొదలుపెట్టాక మొదటిగా చాలా సేపు బాత్ రూమ్ వైపు వెళ్లకుండా ఉండటం ఆడవాళ్ళూ చేసే తప్పుల్లో మొదటిది. దీనివల్లే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మూత్రం రంగు మారితే మంచినీళ్లు ఎక్కువ తాగటం పండ్ల రసం లేదా నీటి శాతం ఎక్కువ వున్న పండ్లు తీసుకోవాలి. ముందు బాత్ రూమ్ కు వెళ్ళటం నామోషీ అనుకోవటం మానేయాలి. వీలైనంత వరకు నూలు తో దుస్తులను ఎంచుకోవాలి. గాఢత వాసన తక్కువగా ఉన్న సబ్బులు వాడుకోవాలి. లో దుస్తులు ఎప్పుడు వెనీళ్ల తో ఉతికి ఎండలో ఆరేసుకోవాలి. దీనివల్ల బాక్టీరియా సమస్య తగ్గుతుంది. నెలసరి సమయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. శానిటరీ నాప్కిన్స్ మార్చుకోవాలి. వీటివల్లనే సగం అనారోగ్యాలు వస్తాయి . రెండు పూట్లా మార్చుకుని వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే సగం జబ్బులు కనిపించకుండా పోతాయి.
Categories