Categories

మహిళల్లో 40 ఏళ్లు దాటిన తర్వాత ముఖ్యంగా ఫిజికల్ యాక్టివిటీ కాస్త తక్కువ ఉండే వాళ్లలో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా వ్యాయామం చేయటం మానేస్తేనే ఎక్కువ సమస్యలు చుట్టుముడతాయి. రక్తసరఫరా మెరుగుపరిచే నడక మానవద్దు. అలాగే నడకతో పాటు జాగింగ్ మొదలు పెట్టటం మంచిది. బెల్లీ ఫ్యాట్ తగ్గించేందుకు జాగింగ్ ఉపయోగపడుతుంది. కొన్ని అదనపు ప్రయోజనాలు కావాలనుకుంటే సైకిలింగ్ మరీ మంచిది లేదా ఈత కొలను అందుబాటులో ఉంటే అరగంట మంచి వ్యాయామం ఓవరాల్ వర్క్ వుట్స్ ఇది. కీళ్లనొప్పులున్న వాళ్ళు వాటర్ బేస్డ్ వ్యాయామాలు ఎంచుకోవడం బెస్ట్.