రీ సైక్లింగ్ మెటీరియల్ తో పాదరక్షకులు తయారు చేస్తోంది మేఘా రావత్. రాజస్థాన్ కు చెందిన మేఘా కురుక్షేత్రలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పర్యావరణ స్పృహ ఉన్న పాదరక్షల తయారీ ఆమె ద్యేయం. రీసైకిల్ ద్వారా కేశాలంకరణ వస్తువులు, బ్రోచెర్స్, ఫోల్డర్స్, పర్స్ లు వంటి ఉత్పత్తులు తయారు చేస్తుంది మేఘా.కురియో పేరుతో ఫుట్ వేర్ డిజైన్ కనిపెట్టి పాదరక్షలు తయారు చేస్తోంది. పాదరక్షలకు ఉపయోగించే పట్టీలు చేనేత దారుల నుంచి సేకరించిన బట్టలు, టైలరింగ్ యూనిట్ల నుంచి తీసుకున్న వస్త్ర వ్యర్థాలు ఉపయోగించి తయారు చేస్తారు. మేఘా తయారు చేసిన కొల్హాపురీ చెప్పులు చాలా ఫేమస్.