Categories
కెంపు లను ధరిస్తే సర్వ శుభాలు చేకూరుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.ప్రాచీన కాలంలో ఈ రూబీ లను కిరీటాలు ఉంగరాలు భుజ కీర్తులు కంకణాలు కర్ణాభరణాల్లో విరివిగా వాడే వాళ్లు కోరండమ్ అనే ఖనిజం నుంచి ఏర్పడే రత్నాలలో కెంపు చాలా ముఖ్యమైనది.ఈ కోరండమ్ నుంచి సఫైర్ జాతికి చెందిన నీలం,కనకపుష్యరాగం, శ్వేత పుష్యరాగం వంటి రత్నాలు భూగర్భంలో తయారవుతాయి. ఈ రత్నాలు కాఠిన్య లో వజ్రాల తర్వాతి స్థానంలో నిలుస్తాయి.కనుల కింపుగా ఉండే ఈ కెంపు నగలు ఏ కాలంలో అయినా ఫ్యాషనే.సంపద అధికారం ఇస్తాయి అని భావించే ఈ కెంపు ని ఒక ఉంగరం లో అయినా ధరించాలి అనుకుంటారు.కెంపు నగల సెట్ తిరుగులేని ఫ్యాషన్ కూడా.