Categories
పోషకాహారం అందించడం ద్వారా పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేలా చూడమంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఈ చలి రోజుల్లో ఇన్ ఫెక్షన్లు, అలర్జీల రిస్క్ లేకుండా ఉండాలంటే మంచి ఆహారమే ముఖ్యం ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే కోడిగుడ్డు ప్రతిరోజు ఇవ్వాలి. పాలకూర, తోటకూర, బ్రోకలీ వంటివి వారంలో ఒక రోజు కచ్చితంగా ఇవ్వాలి. ఆరెంజ్, ఆపిల్ వంటి పండ్లు తినిపించాలి. నట్స్, డ్రైఫ్రూట్స్ ,స్నాక్స్ ఇవ్వాలి. ఈ సీజన్ లో సజ్జలతో చేసిన రొట్టెలు ఇవ్వటం ద్వారా తగినంత ఫైబర్ దొరుకుతుంది. చిలకడదుంప లో ఉండే బీటా కెరోటిన్ రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పని చేసేందుకు తోడ్పడుతుంది. ముఖ్యంగా సాల్మన్ వంటి చేపలు చాలా మంచివి.