ప్రపంచంగా వ్యాప్తంగా సేంద్రియ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది.నల్ల గోధుమలు,నల్ల బియ్యం పసుపు కాప్సూల్స్ శిలాజిత్తుతో పరిపుష్టమైన తేనె, ‘నారా-ఆబా’ అంటే కీవి పండ్లతో తయారు చేసిన వైన్ మొదలైనవన్నీ మన దగ్గర ఉన్నాయి. రెండు మూడేళ్ళలో వీటికి ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు వస్తుంది అంటున్నారు అడిదం నీరజ శాస్త్రి . ఆమె కేంద్ర వ్యవసాయ శాఖలో జాయింట్ సెక్రెటరీగా పని చేస్తున్నారు. మోదీ సర్కార్ అధికారం లోకి వచ్చాక సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పరంపరాగత్ కృషి వికాస్ యోజన (PKVY) అనే కార్యక్రమం ప్రారంభించింది. తెలుగు రాష్టాలతో సహా జార్ఖండ్,ఛతీస్ ఘడ్,కేరళ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఈ కార్యక్రమానికి ,మొదటి నుంచి నీరజ నేతృత్వం వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 6.20 లక్షల హెక్టార్ల సాగుభూమిని ప్రకృతి వ్యవసాయం కిందుకు తీసుకు వచ్చింది. ఏ ప్రాంతంలో అయినా మహిళలు కష్టపడే మాదిరిగా ఉంటుంది అంటున్నారు నీరజ.
Categories