Categories
దేశ సరిహద్దుల్లో పహార్ అనే విధుల్లో మహిళా సైనికులకు తొలి సారిగా స్థానం దక్కింది.జమ్మూ కాశ్మీర్ లోని ఇండియా పాక్ సరిహద్దుల్లో భద్రతా విధుల్లో వీరు పాల్గొంటున్నారు భారత సైన్యం లోని పలు విభాగాల్లో తమ సత్తా చాటుతున్న మహిళలకు సరిహద్దుల్లో సైనిక విధులు కేటాయించారు.పారా మిలటరీ ఫోర్స్ లో విధులు నిర్వహించే అసోం రైఫిల్స్ కు చెందిన మహిళ సాయుధ దళాల బృందానికి ఈ అవకాశం దక్కింది.భారత సైనిక విభాగం ఆర్మీ సర్వీసెస్ గ్రా కార్ప్స్ (ASC)కి చెందిన మహిళ కెప్టెన్ గురు సిమ్రాన్ కౌర్ నేతృత్వంలో ఈ మహిళా సైనికదళం విధులు నిర్వహిస్తోంది.తన కుటుంబం నుంచి మూడో తరం సైనికురాలు సిమ్రాన్ కౌర్.