మంజు దేవి జైపూర్ రైల్వే స్టేషన్ లో పోర్టర్ ఇంకా చెప్పాలంటే తొలి రిపోర్ట్ కూడా. ఆమె సొంత ఊరు రాజస్థాన్ లోని సుందర్ పురా.ముగ్గురు పిల్లలు.భర్త జైపూర్ స్టేషన్ లో పోర్టర్.హఠాత్తుగా మరణించాడు.కుటుంబ భారం ముంజు మీదకు వచ్చింది .పిల్లల పోషణ కు గాను భర్త స్థానంలో పోర్టర్ గా చేరింది.అందరు వెక్కిరించారు.చదువు రాక  పోవటంతో రైళ్ల పేర్లు నంబర్లు తెలిసేవి కావు.నెమ్మదిగా అక్షరాలు దిద్దుకొని రైళ్ల అనుపానులు కనుక్కుంది.లగేజ్ ఎత్తుకోవటం సాధన చేసింది.ఇప్పుడు రోజు 300 సంపాదిస్తోంది.పిల్లల్ని చదివించు కొంటోంది.

Leave a comment