Categories
సృష్టిలోనే నెమలి అత్యంత అందమైంది . పురివిప్పిన నెమలిని చూసేందుకు రెండు కళ్ళు చాలవు . అవన్నీ ఆభరణాలలోకి వచ్చేస్తే . పీకాక్ రింగులు,కర్ణాభరణాలు ,బ్రాస్ లెట్స్ ,లాకెట్స్ ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి . బంగారు,వెండి తో చేసిన ఆభరణాలే కాకుండా ముత్యాలు,ప్యాచ్లు,వజ్రాలు పొదిగిన పీకాక్ పెండెంట్ సెట్ లు చాలా బావున్నాయి . పీకాక్ డిజైన్ నెక్లెస్ తో పాటు కర్ణాభరణాల సెట్ చాలా అందంగా ఉంది . నెమలి లోని అన్ని వర్ణాలు ,ఫించం లోని రంగులతో ప్యాచ్లు,రుబీలు పొదిగిన దుద్దులు చెవుల చుట్టూ ఏర్పరచుకొని యూనిక్ గా కనిపిస్తున్నాయి .