జుట్టు వత్తుగా కనిపించాలి అనుకొంటే కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి . ముఖ్యంగా పెరుగు,గుడ్డు మంచి వ్యాల్యూమ్ అందిస్తాయి . గుడ్డు పొడిజుట్టుకు పోషకాలు అందిస్తే ఆయిలీ జుట్టుకు గుడ్డులోని తెల్లసొన ప్రయోజన కారిగా ఉంటుంది . ఇది జుట్టును క్లెన్స్ చేసి అదనపు నూనె తగ్గించి వ్యాల్యూమ్ ఇస్తుంది . తలస్నానానికి అరగంట ముందర జుట్టుకు గుడ్డు గానీ ,పెరుగు కానీ అప్లయ్ చేయాలి . కొద్దిగా పాలలో గుడ్డువేసి గిలకొడితే జుట్టుకు అప్లయ్ చేసేందుకు వీలుగా ఉంటుంది . షాంపూ చేశాక ఓ మగ్గు నీటిలో నిమ్మరసం సగం కప్పు రోజ్ వాటర్ కలిపి చివరి రిన్స్ గా ఉపయోగిస్తే గుడ్డు వాసన రాదు . జుట్టుదువ్వి తేలిగ్గా బ్లో డై చేయటం వల్ల జుట్టు వత్తుగా కనిపిస్తుంది .

Leave a comment