ఈ కాలంలో కాళ్ళ పగుళ్ళు చాలా సహజంగా వస్తూ ఉంటాయి. వర్షంతో తడిగా వుండే చోట చెప్పులు లేని పాదాలతో తిరగటం వల్ల పగుళ్ళు, ఇన్ఫెక్షన్ వస్తాయి. సాధ్యమైనంత వరకు వర్షంలో వర్షంలో కాసేపు తడిసినా కాళ్ళను పొడి టవల్ తో తుడుచుకోవాలి. వెంటనే మాయిశ్చరైజర్ రాయాలి. ఈ కాలంలో కాటన్ సాక్స్ వేసుకోవడం మంచిది. అలాగే పాదాల పగుళ్ళు తగ్గేందుకు ఒక టబ్ లో పావు వంతు వరకు వెచ్చని నీళ్ళు నింపి కొబ్బరి నూనె, కొంచెం షాంపూ వేసి కాళ్ళు మునిగేలా ఉంచాలి. నెమ్మదిగా ఫ్యుమిక్ స్టోన్ తో రుద్ది, శుబ్రంగా తుడిచి తడి లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాయాలి. మరీ పగుళ్ళు ఎక్కువగా వుంటే లాక్టిక్ యాసిడ్, గైకోలాక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ కాంబినేషన్ ఉన్న క్రీం రాస్తే తగ్గిపోతుంది. వేపాకు మెత్తగా నూరి అందులో పసుపు, నువ్వుల నూనె కలిపి రాసినా పగుళ్ళు, ఇతర చర్మ సంబంధిత సమస్యలు పోతాయి.

Leave a comment