మన దేశంలో ఎన్నో శాస్త్రీయ నృత్యాలున్నాయి. వాటిలో ఎనిమిదింటికి మాత్రమే సంగీత నాటక అకాడమీ గుర్తింపు ఉంది. భరతనాట్యం,కథక్,కధాకళీ,ఒడిస్సా కూచిపూడి మణిపూర్ మోహినీ ఆట్టం సత్రియలు ఇవి ప్రాచ్యురంలోకి వచ్చిన నృత్యాలు. అత్యంత ప్రసిద్ధి పొందింది భరతనాట్యం ప్రాచీన దేవాలయాల స్పూర్తితో సాగే ఈ నృత్యం మత సంబంధమైన కార్య కలాపాల్లో భాగంగా ఉండేది. 19 వ శతాబ్దిలో నలుగురు సోదరులైన తంజావూర్ రాజదర్భార్ కు చెందిన చిన్నయ్య,పొన్నయ్య,శివానందం,వడివేలు ఈ భారతనాట్యాన్ని ప్రదర్శనకు అనుకూలంగా ఒక కళగా తీర్చి పత్రాలలో పొందు పరిచారు. ఈ నృత్యం ప్రధానంగా కదలికలతో ఉంటుంది. చక్కని హావ భావాలుంటాయి మృదంగం,వయోలిన్ వీణ ఫ్లూట్ తాళం సంగీత వాయిద్యాలు కలిసి ఈ నృత్యం అద్భుతంగా ఉంటుంది. ఒకప్పుడు తమిళ దేవాలయాల్లో దేవదాసి లకు మాత్రమే పరిమితంగా ఉండే ఈ నృత్యం ఇప్పుడో కళగా అందరు అభ్యసిస్తున్నారు.

Leave a comment