బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ , జుంబా డాన్స్ ట్రైనర్ సుచేత ఆసియాలోనే టాప్ శిక్షకురాలు ఒక బహుళ జాతి సంస్థలో ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా పనిచేసేది. సర్వశక్తులు ఒడ్డిన యాజమాన్యం తృప్తిపడేది కాదు. ఆ ఒత్తిడితో బాధపడుతూ రిలాక్స్ అవ్వటం కోసం క్లాసికల్ డాన్స్ నేర్చుకొంది. తరువాత అమెరికాలో జుంబా శిక్షణ తీసుకొంది. ఇండియాకు తిరిగి వచ్చి సర్టిఫైడ్ శిక్షకురాలిగా ఒక సంస్థను ప్రారంభించింది. ఇప్పుడామె సెలబ్రెటీ . 3000 మందిని ట్రైయిన్ చేసి లెక్కపెట్టలేనన్ని క్లాసులు కండక్ట్ చేసి వేల మందికి గురువు అయింది సుచేత.

Leave a comment