ఆడపిల్లల నిద్ర అలవాట్లు వారి ఆరోగ్యంపైన పరిశోధన జరిపారు ఐరోపా ఖండం పరిశోధకలు. దాదాపు నాలుగు లక్షల మందిపై ఈ పరిశోధన జరిగింది. ఈ పరిశోధన ప్రకారం ఉదయాన్నే నిద్రలేచే అలవాటున్న వారిలో రోమ్ము కాన్సర్ కేసులు తక్కువగా కనిపించాయి. సాధారణంగా నిద్ర గంటల కంటే అధికంగా నిద్రపోయే వారు ,అదీ ఉదయం వేళ ఆలస్యంగా నిద్రలేచే వారిలో ఇరవై శాతం అధికంగా కాన్సర్ కేసులు ఉన్నాయని తేలింది. వైద్యులు ఈ సందర్భాన్ని విశ్లేషిస్తూ చిరు ఎండలో పని చేసుకొనే వారు కేవలం ఆ సూర్యకిరణాల తాకిడికే ఆరోగ్యంగా ఉన్నారని తేల్చారు. ఎండ వల్ల పొందే లాభాల్ని అర్ధం చేసుకొని ఆడపిల్లలు నిద్ర అలవాట్లు మార్చుకోమంటున్నాయి.

Leave a comment