బట్ వాట్ వాజ్ షి వేరింగ్

వైష్ణవీ సుందర్ తీసిన బట్ వాట్ వాజ్ షి వేరింగ్ డాక్యుమెంటరీ ఇప్పుడు సెన్సేషన్ అవుతుంది.ఈ డాక్యుమెంటరీలో ఉద్యోగం చేసే చోట వేధింపులకు గురైన 32 మంది మహిళల గురించి చెప్పారు. 110 నిమిషాల వినికిడి గల చిత్రంలో 17 సెగ్మెంట్స్ ఉన్నాయి. మహిళలు ఎదుర్కొంటున్న   లైంగిక వేధింపుల గురించి చర్చించారు. సమాజంలో రకరకాల ఆర్థిక ,వృత్తులకు చెందిన వారి కథలున్నాయి. ఈ డాక్యుమెంటరీ కోసం 2016లో పరిశోధన ప్రారంభించింది వైష్ణవి. అప్పటి తన పరిశోధన ఇప్పుడు జరుగుతున్న మీటూ ఉద్యమానికి సపోర్ట్ అవుతుందని ఆమె ఊహించలేదు నా డాక్యుమెంటరీ చూసి ఇది టైమ్ లీగా ఉంది. పదేళ్ళ క్రితం ఉద్యోగ ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టం వచ్చక ,ఆ తర్వాత ఈ డాక్యుమెంటరీ తీశాక ఇప్పుడు దాన్ని విడుదల చేయటం అంతా కో ఒన్ పైడ్ అంటుంది వైష్ణవి.