నిత్యం ఆకుకూరల్ని తినమంటున్నారు  డాక్టర్లు. అయితే ఆకు కూరల విషయంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యాన్ని ఇస్తాయి వీటిని ఎండ తగలని చోటనే ఉంచాలి. ఎండ తగిలితే ఆకుకూరల్లో ఉండే కెరోటిన్ అనే పోషక పదార్థం నశిస్తుంది. ఉప్పు వేసిన గోరువెచ్చని నీళ్లలో కడగాలి . వాటిని పెద్దగా తరగాలి లేదా అసలు తరగకుండా ఉడకబెడితే మంచిది. తాజాగా ఉండే ఆకుకూరలే వండుకోవాలి నిల్వ ఉంచితే పోషకపదార్థాలు పోతాయి. ఆకుకూరను వేయిస్తే అందులోని ఖనిజాలు పోషకాలు పూర్తిగా నశిస్తాయి.  క్యారెట్, ముల్లంగి దుంప కూరల తో పాటు వాటికి ఉండే ఆకులను కూడా వండుకుని తింటే ఆరోగ్యం.

Leave a comment