వేసవి ఎండలకు శరీరానికి చల్లదనం ఇచ్చేందుకు చేనేత, కాటన్ చీరెలు ఇష్టపడతారు. చక్కని నూలుతో ఇవి నేత చీరలు అనిపించేలా ఉండే ఈ మెత్తని చీరెలు పండుగలు,వేడుకలు సందర్భాల్లో కట్టుకొనే డిజైనర్ చీరెల్లా మారిపోయాయి. సాధారణంగా ఇవి లేత రంగులే అయి ఉంటాయి. చిన్న చిన్న పూల బూటీలు చక్కని పువ్వుల అంచులు, లతలతో విస్తరించిన పైట కొంగులు మామూలు నూలు చీరెలకు ప్రత్యేక అందం ఇచ్చేశాయి. ఏనుగుల మోటెఫ్ లు పూవుల ప్రింట్స్ తో పల్చని మెత్తని కాటన్ చీరెలు ఖరీదైన ఏ చీరెలకీ తీసిపోసి అందంతో మెరిసిపోతున్నాయి.

Leave a comment