చితి మంటలు చిత్రీకరించాను

హత్రాస్ లోనే బుల్గాడీ కి చెందిన యువతిపై అత్యాచారం జరిగింది ఆస్పత్రిలో చనిపోయిన ఆమె మృతదేహాన్ని అంబులెన్స్ లో  బుల్గాడీ కి తరలించి ఊరి పొలిమేర్ల లో కుటుంబీకులను దగ్గరకు రానివ్వకుండా అంత్యక్రియలు నిర్వహించారు పోలీస్ లు.దీన్ని తెలుసుకుని అంబులెన్స్ ను అనుసరించి వచ్చింది.తనుశ్రీ పాండే.మృతదేహం తగలబడి పోతుంటే ఏం మండుతోంది? ఏం జరుగుతోంది అని పోలీసుల పై ప్రశ్నల వర్షం కురిపించింది.తనుశ్రీ పాండే.మండుతున్న చితిమంటల ను దూరం నుంచే చిత్రీకరించి ఆ దృశ్యాలను ప్రపంచానికి చాటింది తనుశ్రీ.మృతురాలి కుటుంబానికి చివరి చూపు కూడా లేదు. అందుకే తెల్లారే వరకు అక్కడి నుంచి కదలలేదు. వాళ్లకు న్యాయం జరగాలని ఎంతో కోరుకొన్న అంటోంది తనుశ్రీ పాండే. సోషల్ మీడియా వేదిక లో హత్రాస్ ఘటన లో జరిగిన వాస్తవాలు బయటకు తెచ్చేందుకు ప్రాణాలకు తెగించింది తనుశ్రీ పాండే.