అందరి పిల్లలకూ ఒకే రకమైన ఐక్యూ ఉండదు.కొందరికి అదే వయసు గల పిల్లలలో పోల్చిన తెలివితేటలు తక్కువగా ఉంటాయి. చదువులో గ్రహణ శక్తి ,జీవితానికి సంబందించిన నైపుణ్యాలతో వెనుకబడే ఉంటారు. వాళ్ళపైన ఒత్తిడి పెంచటం లేదా వీళ్ళ వల్ల ఏమీ కాదు అని ఉదాసీనత చూపించటం రెండూ మంచివి కావు. ఆ వయసులో ఉండవలసిన నైపుణ్యాలకు సంబంధించి మానసిక వైద్యులతో సంప్రదించాలి. వాళ్ళపట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ నిపుణుల సిఫార్స్ లు ఎమైతే ఉన్నాయో అవన్ని అమలు పరచాలి. స్కూల్ వ్యవస్థ కూడా వారి అవసరాలకు సూటయ్యే విధంగా ఉంటే ఇంకా మంచిది. వారి దగ్గర నుంచి ఎక్కువ ఆశించకుండా అనుకూల ధృక్పథంలో వారి లోని నైపుణ్యాలను తెలివితేటలను సానపట్టేందుకు సకల ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది.

Leave a comment