తెలుగులో నేను నటిస్తున్న రెండు చిత్రాలు బయటికి వస్తే ఆ సినిమాల్లో కొత్త లావణ్య త్రిపాఠిని చూస్తారు అంటుంది లావణ్య. యూత్ కు నచ్చే గ్లామర్ ఉన్న పాత్రలు అవి. నాకు హర్రర్ సినిమాలు అంటే చాలా ఇష్టం. కాని ఇప్పటివరకు ప్రేక్షకులను భయపెట్టే చిత్రాలు చేయలేదు. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్ని లవ్ స్టోరీలే. ఎప్పటికైన ఓ హర్రర్ మూవీ చేస్తా అంటుంది లావణ్య త్రిపాఠి. నా కోసం కొన్ని సినిమాలు వస్తాయి. ఒక్కోసారి కథలు నచ్చవు అప్పుడు నో అనటానికి నాకెంతో ఇబ్బంది. నన్ను నా నటనను చూసి ఇష్టపడే ప్రేక్షకులు, నా పైన నమ్మకం ఉన్న దర్శకులు, నిర్మాతలు ఉన్నారు. నాకెరీర్ లో మంచి సినిమాలు చేయటమే నాకు ఇష్టం. అందుకే ఎక్కువ సినిమాల్లో కనిపించటం లేదంటుంది లావణ్య త్రిపాఠి.

Leave a comment