ఎదో ఒక స్వీట్ ఉంటేనే గానీ భోజనం సంపూర్ణం కాదంటారు. అంచేత చాక్లేట్ భోజనంలో తుది పదార్థంగా కేక్ ట్రిఫిల్ ఎక్లైర్స్ చీజ్ కేక్ టోఫీ ప్లాన్ పై మఫిన్లు ఐస్ క్రీమ్ లు చిపొడుగైనా లిస్ట్ గా పాప్యులర్ అయిపోయింది . అయినా చాక్లేట్  తింటే మొటిమలు వస్తాయని పళ్ళు పుచ్చిపోతాయని అన్నా సరే దాన్ని ఎదురుగా చూసాక మాత్రం ఇలాంటికంప్లెయింట్స్  గాలికి ఎగిరిపోతాయి. ఎర్రని పచ్చని కోకో పండ్ల గింజలను పులియ బెట్టి వేయించి  పొడి కొడితే కోకో పొడి తయారవుతుంది. బీన్స్ నుంచి వెతికి తీసే కొవ్వు కోకో బటర్ . ఇది చాక్లేట్ కు క్లాసీ మృదువైన టెక్చర్ ఇస్తుంది. గ్రీన్ టీ మాదిరిగానే చాక్లేట్ లో సమాన స్థాయిలు ఫెనోలిక్  గుణాలు గాలిక్ యాసిడ్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రయోజనం పొందాలంటే ఉదయాన్నే ఒక కప్పు హాట్ కోకో ,మధ్యాహ్నం గ్రీన్ టీ తాగాలని నిపుణుల సూచన. డార్క్ చాక్లేట్ల నుంచి పూర్తి ప్రయోజనాలు  పొందాలంటే వాటి నుంచి లభించే క్యాలరీల మోతాదును సమంగా డైట్ లోని ఇతర పదార్ధాల క్యాలరీలను కట్ చేసుకోవాలి. పూర్తి ఆహారంలో చాక్లేట్  ను ఉంచేసుకుని మిగిలిన పదార్ధాల్లో క్యాలరీలు లేకుండా చూసుకోవాలి.

Leave a comment