గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలుంటాయి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. వీటిలో ఉండే ఫైటో స్టిరాల్స్ ,యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి హాని చేసే కారకాలతో పోరాడతాయి.గింజల్లోని ఫైటో ఈస్ట్రోజన్స్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. మెనోపాజ్ సమస్యను అదుపులో ఉంచుతుంది.ఇందులో పీచు జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది.మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఈ గింజలు,సగం పావు కప్పు గుమ్మడి గింజల్లో మన శరీరానికి రోజూ అవసరం అయ్యే మెగ్నీషియం దొరుకుతుంది. గుండె పనితీరు మెరుగై అధిక రక్తపోటు అదుపులో ఉంచుతుంది. ఈ గింజలు శరీరంలో వ్యాధి నిరోదక శక్తిని పెంచుతాయి.

Leave a comment