మచ్చలు పోగొట్టే యాలుకలు

ముఖం పైన మచ్చలు మరకలు ఉంటే యాలుకలు వాటిని మాయం చేస్తాయి అంటారు ఆయుర్వేద నిపుణులు. యాలకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ సెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.యాలుకలు పొడి చేసి ఆ పొడిలో పాలు, తేనె కలిపి పేస్ట్ లా చేయాలి ఆ పేస్ట్ ను మచ్చలున్న చోట మసాజ్ చేస్తున్నట్లు రాయాలి. పది నిమిషాలు ఆరనిచ్చి, చల్లని నీళ్ళతో శుభ్రం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మొహం పైన మచ్చలు మరకలు పోయి ముఖం తేటగా ఉంటుంది.