మార్బుల్ పేలెస్

కలకత్తాలోని మార్బుల్ పే లెస్ చూడదగిన చారిత్రాత్మక ప్రదేశాల్లో ఒకటి. 19వ శతాబ్దంలో సంపన్న వ్యాపారవేత్త రాజా రాజేంద్ర ముల్లిక్ ఈ భవనాన్ని నిర్మించారు.అలనాటి యూరోపియన్ ఆర్కిటెక్చర్ కు ఈ అందమైన పాలరాతి భవనం చక్కని ఉదాహరణ. రమణియమైన పాలరాతి ఫ్లోరింగ్ ,గోడల్లో అరలు 76 అరుదైన శిల్పాలు,పెయింటింగ్స్, అద్భుతమైన శాండిలియర్స్ పురాతన గడియారాలు వస్తువులతో ఇది రాజారాజేంద్ర ముల్లిక్ వారసుల నివాసం కూడా,ఇక్కడ జూ అరుదైన పక్షులు ఉన్నాయి.ఫోటోలు తీయడం నిషేధం.ప్రవేశం ఉచితం. ఒక రాజభవనాన్ని చూసే అనుమతి కోసం ఈ సువిశాలమైన ప్యాలెస్ ని తప్పకుండా చూడాలి.