నా పాత్రలు నన్ను మార్చాయి

” నా సినిమా లో పాత్రలను చూసి నేను ఎంతో నేర్చుకున్నాను థప్పడ్ లో నా పాత్ర పేరు అమృత. సహనం ఎంతో అవసరమో చెబుతుంది అమృత. పింక్ సినిమా లో మీనాల్  అనే మధ్యతరగతి అమ్మాయి పాత్ర ఎవరో ఏదో అనుకుంటారని వెనకడుగు వేయవలసిన అవసరం లేదంటుంది. నామ్ షబనా,సాండ్ కీ ఆంఖ్ లోప్రకాషీ పాత్ర నన్ను చాలా ప్రభావితం చేశాయి అంటుంది తాప్సీ.ప్రపంచం ఎంత అభివృద్ధి పథంలో నడుస్తున్న లింగవివక్ష అలాగే వుందని తేల్చుకున్నాను. ఒక స్వచ్ఛంద సంస్థతో కలిసి బాలికా విద్య పై అవగాహన కల్పిస్తున్నాను.అమ్మాయి  డ్రాప్ వుట్స్  తగ్గించేందుకు బాలికలకు ఆర్థిక చేయూత కోసం విరాళాలు సేకరిస్తున్న అంటోంది   తాప్సీ.