ఒకే నగను రెండు విధాలుగా ధరిస్తే వెరైటీగా ఉంటుంది. టూ ఇన్ వన్ నెక్లెస్ కామ్ పెండెంట్ ఇలాటిదే ఈ నెక్లెస్ లో చిన్న చిన్న అయిస్కాంతాలు అమరుస్తారు.నగ డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. నెక్లెస్ పెండెంట్స్ గా చేయాలనుకుంటే దాని మధ్యలో వేలాడే లాకెట్ కు అటు ఇటు రెండు వైపులా ఉండే చెయిన్ లను లాకెట్ చుట్టూ అమర్చేందుకు వీలుగా మార్పు చేయవచ్చు. నెక్లెస్ లా దూరం దూరంగా ఉన్న చిన్న పెండెంట్ లు అతుక్కుని ఒకే ఒక్క పెద్ద లాకెట్ లాగా అయిపోతాయి. మళ్ళా నెక్లెస్ చేయాలంటే దగ్గరకు చుట్టిన దాన్ని విడదీస్తే సరి. ఈ నగ ఇలా మార్చాము అని మనంతట మనం తీసి చూపించే వరకు ఎవరూ కనిపెట్టలేరు కూడా.

Leave a comment