Categories
బుజ్జి కుక్కను పెంచుకోండి. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుందంటున్నారు వైద్యులు. పొద్దుటూ కుక్కను తోడుగా తీసుకుని దాని వెనకాలే నడుస్తూ పరిగెడుతూ కదులుతూ వుంటే జాయింట్లు చుట్టూ గల కండరాళ్ళు బలోపేతం అవుతాయి. జాయింట్లపై వత్తిడి తగ్గిపోతుంది. పెంపుడు జంతువులు ముఖ్యంగా కుక్కను పెంచుకునే వారు ఆర్దారైటీస్ నయం చేసుకోగలదని ఇటివల ఒక పరిశోధన లో గుర్తించారు. ముఖ్యంగా మీనియేచర్ స్కాంజర్స్,బాక్సర్స్, గోల్డెన్ రిట్రీవర్స్, బీజ్లీవ్, శక్తి వంతమైన బ్రీడ్స్ అని పరిశోధనలు చెప్పుతున్నాయి. ఇవి జీవితాన్ని పరిరక్షిస్తాయి. పెంపుడు జంతువులతో పాజిటివ్ దృక్పదం పెరుగుతుంది. రుమటాయిడ్ అర్ధరైటీస్ తో ఇబ్బంది పెడుతున్నప్పుడు పెట్స్ తో ఆడుకుంటే ఆనందం, వాకింగ్ చేస్తే ఆరోగ్యం అన్నమాట.