ప్రతి రోజూ తినాలి

క్యారెట్ రోజుతిన్నా మంచిదే . కానీ ప్రతిరోజు తినడం బోర్ కొడితే రెగ్యులర్ డైట్ లో వివిధ రూపాల్లో తీసుకోవచ్చు . ఈ వర్షం చినుకుల్లో వేడివేడి సూప్ తాగితే భావుంటుంది. కేరెట్ తో సూప్ తయారు చేసుకోవచ్చు . ఫ్రైడ్ రైస్ లో కార్న్,బీన్స్ వేసినట్లే క్యారెట్ కూడా కలుపుకోవచ్చు . క్యారేట్ పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుంది . మిక్సడ్ వెజిటేబుల్స్ లో క్యారెట్ కలిపిన కూరగాయలు పెట్టొచ్చు . మఫిన్స్ ,బ్రెడ్ వంటి భెక్డ్ పదార్దాల్లో క్యారెట్ వాడితే దానికి ఉండే తీయని రుచి లో ఈ పదార్దాలు మరింత రుచిగా ఉంటాయి . ముఖ్యంగా కంటి చూపు మెరుగుపరిచే గుణం ఉన్నా క్యారెట్ ను పిల్లలకు రోజువారీ ఆహారంగా ఇవ్వదలచు కొన్నప్పుడు రకరకాల పదర్దాల్లో వీటిని కలపడం మంచిది .