ఎండల్లో కాలు బయటపెట్టాలంటే చిరాకు . చెమటలు ఉక్కతో బొత్తిగా ఎనర్జీ లెవల్స్ తగ్గిపోతూ ఉంటే ఇంకేం వ్యాయామం అని చాలా మంది ఆడవాళ్ళు రిలాక్స్ అయిపోతారు. ఈ సెల్ఫ్ పిట్ అవతలపెట్టండి వ్యాయామాలు మానక్కర్లేదు హాయిగా ద్రవపదార్ధాలు తీసుకొని ఎప్పటిలాగా వాకింగ్ లు వ్యాయామాలు చేసేయండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.  ఉదయం పది నుంచి పాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలోకి రాకుండా, వాతావరణం కాస్త చల్లబడిన తర్వాత సాయంత్రం వేళల్లో వ్యాయామాలు ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకొంటే ఎలక్ట్రోలైట్స్ ను భర్తీ చేయాలి .స్వేదంతో శరీరంలో నీరంతా ఆవిరై నీరసం రాకుండా చూసుకోవాలి. నీళ్ళు తాగాలి. ఎంత దాహాం వేసిన కూల్ డ్రింక్స్ మాత్రం వద్దు .

Leave a comment