Categories

శరీరంలో ఏర్పడే విషతుల్యాలన్నీ ఎప్పటి కప్పుడు బయటికి పంపిస్తే కానీ ఆరోగ్యం సమకూరదు ఈ డిటాక్సె ఫికేషన్ చాలా అవసరం అంటున్నారు డాక్టర్లు . కొన్ని పానీయాలు పని చేస్తాయి అంటున్నారు. గోరు వెచ్చని నీళ్ళలో నిమ్మరసం, మిరియాలు పొడి కలుపుకొని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి అప్పుడు శరీరంలోని మలినాలు బయటికి పోతాయి జీర్ణశక్తి పెరుగుతోంది. క్యారెట్ బిట్ రూట్ వంటి జ్యూస్ లలో యాపిల్,పుదీనా కొత్తిమీర కలుపుకొని తాగితే చాలా మంచిది . అలాగే కలబంద గుజ్జును నీళ్ళలో గానీ బత్తాయిరసాం తో గానీ ఉదయాన్నే తాగితే శరీరంలోని హానికరమైన పదార్దాలు నశిస్తాయి.