స్లిమ్ లుక్

నలుపు రంగు దుస్తులు బాగుంటాయి . ఎప్పుడు మారని ఫ్యాషన్ కూడా . శరీరపు భారతనం తెలియనీయకుండా స్లిమ్ గా ఉంచుతుంది . కానీ ఒకే నలుపు రంగు దుస్తులు యూనిఫారమ్ లాగా అనిపిస్తుంది . నలుపు విలాసంగా, క్లాసీగా ,స్ట్రమ్ గానే ఉంటుంది . కానీ బోరింగు గా యాంత్రికంగా లేకుండా నలుపును నావీ బ్లూ తో కలిపినా ఎంతో అందం . అలాగే బ్లాక్ ప్రింట్స్ ,ఇంకా మిగిలిన డార్క్ కలర్స్ జతగా వేసుకొన్న నలుపు మరింత అందంగా ఉంటుంది . పైగా చినుకులు పడే ఈ రోజుల్లో గాఢమైన రంగులే అందం . ముఖ్యంగా నలుపు వాతావరణంలో వుండే డల్ నెస్ ను తగ్గించి ఒక రియల్ లుక్ ఇస్తుంది . సాయంత్రం పార్కుల కోసం జార్జెట్ సిల్క్ మెటీరియల్ లో బ్లాక్ ,ఇతర రంగులు కలసి చక్కని డ్రస్ నో చీర నో ఎంపిక చేసుకోవచ్చు .