నేను నటించిన ప్రతి పాత్రలోనూ ఎక్కడో ఒక చోట నేనుంటాను కానీ అలా ఉండటం తప్ప ఏ దశలోను నా ఇష్టం వచ్చినట్లు నటించాలనుకోను. నా పాత్రను దర్శకుడు చెప్పినట్లు నటిస్తూ పోతాను అంతే. నా మనసుకి తెలుస్తుంది. ఆ పాత్రలో నా ఛాయలు నా అలవాట్లు ఆలోచనలు ఉన్నాయని కానీ నేను స్వతంత్రించి అవన్ని నా పాత్రలోకి లాగాలని చూడను.నాకు తెలిసిందే కదా అని పాత్రను ఎక్కువ చేయటం ,తగ్గించటం ఏదీ లేదు. ఏ పాత్రైనా నా వ్యక్తిత్వానికి దగ్గరగా అనిపించేలా మటుకు జాగ్రత్తాపడతాను అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు నేను నటిస్తున్న దేవ్ సినిమాల్లో ఎప్పుడు కష్టపడే అమ్మాయిగా కనిపిస్తా . నిజానికి ఆ ఛాయలు నాలో ఉన్నాయి కూడా. అది తెలుసుకొని సంతృప్తి పడటం తప్ప నన్ను ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయనివ్వను అంటోంది రకుల్.

Leave a comment