మహిళల శక్తి సామర్థ్యాల పై నమ్మకం పెంచింది ఓలా ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ. తమిళనాడు లో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ పేరుతో నిర్మిస్తున్న అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ మహిళలే నిర్వహిస్తారని చెబుతోంది. 10 వేల మందితో ఆల్ ఉమెన్ టీమ్ ని ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. అందులో భాగంగానే మొదటి బ్యాచ్ మహిళా ఉద్యోగుల తో సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేశారు ఈ సంస్థ సి.ఇ.ఒ  భవిష్ అగర్వాల్.ఇప్పటికే ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ గా పేరు పొందింది. ఇప్పటికే ఈ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాంట్ గా పేరు పొందింది. ఆటోమొబైల్ రంగంలో స్త్రీల టీమ్ తో కొత్త శకం ప్రారంభమైనట్లే.

Leave a comment