Categories
Standard Post

నీళ్ళకు ఆరోగ్యం కలిపి ఇచ్చేస్తాయి

ఇప్పుడు వస్తువులు మార్కెట్ చేసుకోవాలంటే ఫస్ట్ సౌకర్యం, అందం, ఎక్కడికైనా తేలికగా మోసుకుపోగల అవకాశం అన్నింటిని మించి ఆరోగ్యం తోడైతే చాలు హాట్ కేకుల్లా అమ్ముడైపోయినట్లే. ఇప్పుడు ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్ళు నిల్వవుంచినా, తాగినా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెపుతున్నాయి. ఇంట్లో వాటిని అవతల పెట్టి గ్లాసులతో, చెంబులతో తాగవచ్చు. మరి ప్రతి రోజు మంచి నీళ్ళు మన వెంట తీసుకు వెళ్ళే అవసరం వుంటే ఆ నీళ్ళు ఆరోగ్యంగా అందాలంటే ఇప్పుడు రాగి వాటర్ బాటిళ్ళు మార్కెట్ లోకి వచ్చాయి. రాగి బిందెల్లో, చెంబుల్లో అందే ఔషద గుణాలన్నీ వీటిలోనూ ఉంటాయి. వీటితో పాటు నీటిని వడబో సే ఫిల్టర్ వాటర్ బాటిళ్ళు, పళ్ళ రసాలు తీసుకునేందుకు వాటర్ బాటిల్ విత్ జ్యూసర్, కాగితంతో తయారు చేసే పేపర్ వాటర్ బాటిళ్ళు మొదలైనవన్నీ మంచి నీటిని మరింత శుభ్రంగా అందిస్తున్నాయి.

Leave a comment