Categories
Uncategorized

పొగలు కక్కే ఐస్ క్రీమ్స్, చిప్స్

ఐస్ క్రీమ్ నోట్లో వేసుకోగానే నోట్లోంచి, ముక్కులోంచి పొగలొస్తే ఎలా వుంటుందీ. అలాగే పాప్ కార్న్ తిన్నా, చాట్ నమిలినా గమ్మత్తుగా పొగలోస్తాయి. పైగా ఫ్రెష్ గా ఈ పదార్ధాలు కరకరలాడతాయి. ఇవి తిన్నాక ఈ పొగలు తెప్పించే అనుభవం కోసం పిల్లలు అక్కడికి వెళ్దాం అంటారా లేదా? ఇదీ వ్యాపారం. ఇలా పుట్టుకొచ్చిందే లిక్విడ్ నైట్రోజన్. ఆహార పదార్ధాల వాడకంలో దీని వాడకం ప్రపంచంలో ఇప్పుడో ఫ్యాషన్ ట్రెండ్. అతి శీతలంగా ఉండే ఈ ద్రవంలో చాక్లెట్ క్షణాల్లో గట్టిపడిపోతుంది. సెకన్లో జ్యూస్ చల్లగా అయిపోతుంది. దీన్ని ఉపయోగించి చేసిన పదార్దం నోట్లో వేసుకోగానే పొగలొచ్చి చూసే వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. నైట్రోజన్ భాష్పీభవన స్థానం 196 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో నైట్రోజన్ ని లిక్విడ్ నైట్రోజన్ అంటారు. ప్రపంచంలోని అతి చల్లని పదార్ధాల్లో ఇదొకటి. పాప్ కార్న్, చిప్స్, సలాడ్స్, జ్యూస్ లు, కాక్ టెయిల్స్ కు ఈ చల్లని ద్రవాన్ని కలిపి ఇవ్వడం రెస్టారెంట్స్ లో కొత్త ప్రయోగం.

Leave a comment