శోధిస్తుంటే మంచి విషయాలు దొరుకుతాయి. చాక్లేట్లు అందరికీ ఇష్తమే. మానసిక ఒత్తిడి తగ్గుతోంది ఒక చాక్లేట్ ముక్క తినండి అని డాక్టరు సలహా ఇస్తే ఎంత బావుంటుందీ.. స్తబ్దంగా ఉన్నా మూడ్ డల్ గా అనిపించినా మనస్సు మళ్ళీ ఉత్తేజం పొందాలంటే పంచదార తో చేసిన ఎదో ఓక  పదార్ధం  చాక్లేట్ ఐస్ క్రీమ్  తీసుకుంటే సరైన క్యాలరీలు శరీరానికి అంది ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందిట. బంగాళా దుంపలు బఠాణీ  పుట్టగొడుగుల్లాంటివి వండుకుని తినటం వల్ల  అవసరమైన పోషకాలు అంది మనసు ఉత్సాహం పొందుతుంది.  క్రీమ్  పాస్తా కాండీ బార్ తిన్నా మూడ్ సరిపోతుంది. అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఇష్టమైన ఆహారం తిన్నా సరే. ఉడికించిన సాల్మన్ లేదా స్టారిన్ చేపలు గోధుమ బ్రేడ్ మంచివే. విటమిన్ డి ఉన్న ఏ పదార్ధమైనా సరే. స్ట్రా బెర్రీస్ కాయ ధాన్యాలు మనోవ్యాకులతను తగ్గిస్తాయి. కానీ ఇవి తాత్కాలికమైనవే. కనే మందుల కంటే వందరెట్లు మంచివి. అసలు మూడ్ మార్చుకోవటం అన్నది మన ఆలోచనా విధానానికి సంబంధించింది. సమస్య వస్తే పరిష్కారమనే  కిటికీ చప్పున తెరవాలి. అప్పుడిక స్ట్రెస్లు మూడ్స్  అన్నీ సరవుతాయి.

Leave a comment