Categories
Sogasu Chuda Tarama

సంప్రదాయంగా ఉండటం కూడా ఫ్యాషనే.

కాలేజిల్లో చాల వేడుకలు జరుగుతాయి. ప్రతి వేడుకలో ఒక మరపు రాని జ్ఞాపకంగా మలుచుకోవచ్చు. ఇప్పుడు పుట్టిన రోజులో ధీమ్ బెస్ట్ వేడుకల్లా జరుపుకోన్నట్లే కాలేజ్ ఫంక్షన్స్ కూడా జరుపుకోవచ్చు. అందరూ ఒకే లాంటి డ్రెస్ వేసుకోవచ్చు. వైరైటీ డ్రెస్ లు ట్రైయ్ చేయవచ్చు. మొత్తం స్నేహ బృందంతో కలిసి రెట్రో బాలీవుడ్ ధీమ్ లు  ఎంచుకోవచ్చు. అప్పుడు అందరు ఒకేలా ఉంటారు. లేదా పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలి అనుకొంటే చక్కని అనార్కలి గౌన్ లు, క్రాప్ టాప్ లు, స్కర్ట్ లు ఎంచుకొంటే ఈ వేడుకలకు అందం తెస్తాయి. పూర్తిగా ఆధునికంగా లేదా పూర్తిగా ట్రేడిషనల్ గా కూడా మంచి లుక్ వస్తుంది. ఎప్పుడు మోడరన్ డ్రెస్ లేనా అనుకొంటే చక్కగా పట్టు పరికిణీ ఓణీ ట్రైయ్ చేయండి. అధింకా బాగుంటుంది.

Leave a comment