“హనుమంత ప్రసాదం”

“బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతాః

ఆజాడ్యం వాక్ పటుత్వం చ
హనుమంత్ స్మరణాత్ భవేత్”.
పిల్లలు ముందుగా ఇష్టపడి పూజించే దైవం హనుమంతుడు. పేరు తలచి ఏ కార్యం కానివ్వండి వాయువేగంతో విజయం సాధించేస్తారు.ముఖ్యంగా పిల్లల విషయంలో హనుమంతుని పూజ సర్వ రోగ నివారణ,దుష్ప్రభావాలు,గాలి చేష్టలను దరి చేరవు.మన ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఆంజనేయుడి పటము పెట్టిన ఎల్లవేళలా మనలను అభయ ఆంజనేయుడుగా రక్షిస్తాడు.సింధూరం,తమలపాకులు అత్యంత ఇష్టం.మంగళవారం,శనివారం నాడు భక్తులు 3,5,9,11తమలపాకుల దండతో పూజిస్తే కోరిన కోరికలు తీర్చే స్వరూపుడు.
అంజనీ పుత్రుని ఇష్టాలు: పాయసం,చిట్టి గారెలు,అప్పాలు.
నిత్య ప్రసాదం: కోబ్బరి,అరటిపళ్ళు, చిట్టి గారెలు.
గారెల తయారీ: రాత్రి నానబెట్టిన మినప్పప్పులో నీరు తీసేసి,తగిన పచ్చిమిర్చి ముక్కలు,ఉప్పు వేసి రుబ్బుకోవాలి.బాణాలలో నూనె వేడి చేసి,అరటి ఆకు/ పాలిథీన్ కవరు పైన పిండిని చక్రంలా వత్తుకుని నూనె లో వేయాలి.
అప్పాలు:బెల్లం తగినంత తీసుకొని నీళ్ళలో నానబెట్టి,కరిగిన తరువాత,ఉడికించి, బియ్యం పిండిని బెల్లం పాకంతో కలిపి నూనె వేడి చేసి వేయాలి. అంతే ప్రసాదం తయారు.
జై హనుమాన్. -తోలేటి వెంకట శిరీష

Leave a comment