భోపాల్ లోని కోలార్ ప్రాంతంలో పానీపూరీలు అమ్మే 28 ఏళ్ల అంచల్ గుప్తా ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అతనికి అమ్మాయి పుట్టింది. అయ్యో అమ్మాయా ? అని బంధువులు మిత్రులు అంటుంటే కోపం వచ్చింది. అతనికి తనకు కూతురు పుట్టినందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పేందుకు పాణి పూరి లతో విందు చేశాడు అంచల్ గుప్తా. కోలార్ ప్రాంతంలో భీమ్ కుండ్ రోడ్డు లో మూడు స్టాల్స్ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్లకు పానీ పూరి ఫ్రీ అని ప్రకటన ఇచ్చాడు. ఈ వేడుకల్లో పాల్గొని పానీ పూరి లు స్నాక్స్ ఉచితంగా తినేసి అంచల్ కు పుట్టిన కూతురు ను ఆశీర్వదించారు వూరి జనాలు.

Leave a comment