Categories
Gagana

ఆమె ఫిట్నెస్ రహస్యం ఇదే.

శిల్పాశెట్టి సినిమాలు తగ్గించుకుని కార్పోరేట్ ఉద్యోగాల కోసం ఫిట్నెస్ పాఠాలు చెప్పుతుంది. ఆమె చెప్పే యోగా రహస్యాలు ఇవాల్టి తరం అమ్మాయిలు నేర్చుకుని తీరాలి. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు 31 కేజీలు బరువు పెరిగి, పాపను కన్నాక రోజుకు 20 నిమిషాల చొప్పున వ్యాయామం చేస్తూ, నెమ్మదిగా పెంచుకుంటూ పోతూ పది నెలల్లో 20 కేజీల బరువు తగ్గిందట. శరీరాన్ని అంట చక్కగా మెయిన్  టైన్ చేసేందుకు జిమ్ తో పాటు యోగా చేస్తుందిట శిల్పాశెట్టి. యోగా ఒక జీవన విధానం అంటోంది. ఆమె ఆహారంలో రోజుకు 1800 కేలరీలకు మించదు. కానీ దీన్ని కరిగించేందుకు అదే స్ధాయిలో వ్యాయామం చేస్తుందిట. ఆహార నియమాలు ఖచ్చితంగా పాతిస్తుంది. పిండి పదార్ధాలు ఎక్కువగా వుండే బ్రౌన్ రైస్, బ్రౌన్ పాస్త, బ్రౌన్ షుగర్, బ్రౌన్ బ్రెడ్ వంటివే మేనులో ఉంటాయట. మనవాళ్ళు బ్రౌన్ రైస్ తినమంటే అమ్మో కష్టం అంటారు. మరి ఇంత కష్టపడితేనే తీరిన శరీర ఆకృతి వుంటుంది.

Leave a comment