Categories
చిన్న వయసులోనే జుట్టు తెల్లగా అయిపోతూ ఉంటుంది. అలాంటపుడు ఈ చిన్న చిట్కా ట్రై చేయెచ్చు . బంగాళ దుంపపై తొక్కలో విటమిన్ ఎ , బి ,సి లుంటాయి . వీటికి జుట్టును నల్లగా మార్చే గుణం ఉంటుంది . బంగాళదుంప పై పొట్టు తీసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఓ లీటర్ నీటిని వేడి చేసి మరిగే నీళ్లలో ఈ తొక్కలు వేసి 30 నిమిషాల పాటు ఉడికించాలి.చల్లారాక ఈ నీళ్లు వడకట్టి , ఫ్రెష్‌గా ఉన్న జుట్టుకు అప్లైయ్ చేసి పదినిమిషాలు మసాజ్ చేయాలి.ఓ అరగంట అలా వదిలేసి చల్లని నీటిలో తలస్నానం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే జుట్టు నల్లగా మారుతుందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు . ఇదేమి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వని చిట్కా గనుక ట్రై చేయచ్చు.