మొక్కలకి రంగుల పూలు పూయటం చాలా సహజం . కానీ ఉదయాన్నే ఓ రంగులో విరబూసిన పువ్వు సాయంత్రానికి ఇంకో రంగులోకి మారిపోవటం విచిత్రం . అలాంటి పువ్వు  ముద్దమందారాల్లో ఒకటైన పత్తిమందారం . హైబిస్కస్‌ మ్యుటాబిలిస్‌ దీని శాస్త్రీయ నామం  .దీన్నే కాన్ఫడరేట్‌  రోజా అని , కాటన్‌రోజా మాలో అని పిలుస్తారు. ఈ పువ్వులు రంగుమారటానికి  సూర్యకాంతే  కారణం . తెల్లగా పూసిన పువ్వు కోసి ఫ్రిజ్‌లో పెడితే బయటకు తీసే వరకూ  తెలుపు రంగే . గది ఉష్ణోగ్రత వద్ద గులాబీ రంగుకు వచ్చేస్తుంది. ఉష్ణోగ్రత వ్యత్యాసం పగటి కాంతులను బట్టి పూలు రంగులు మార్చేస్తాయి .ఈ సారి గార్డెన్‌లోకి  వాకిలి ముందుకు ఓ చక్కటి పూల మొక్కను కొనాలి .అనుకొన్నప్పుడు ఈ ప్రత్తి మందారం  వైపు చూడండి . ఇలా రంగులు మార్చే పూల జాతుల గురించి గార్డెన్‌ వివరాలు అడగండి .

Leave a comment