Categories
ఒకే సారి గంట సేపు వాకింగ్ చేసే కంటే ప్రొద్దుట టిఫిన్ చేసిన తర్వాత ఐదు నుంచి పది నిమిషాలు మధ్యాహ్నం లంచ్ తర్వాత పది నిమిషాలు రాత్రి డిన్నర్ తర్వాత పది నిమిషాలు అలా రోజు మొత్తం అరగంట నడిస్తే రక్తంలో షుగర్ నిల్వలు బాగా తగ్గుతాయి అంటున్నారు అధ్యయనకారులు. తిన్న తర్వాత ఐదు నిమిషాల లోపు లేచి ఐదు పది నిమిషాలు వాకింగ్ చేస్తే రక్తంలో షుగర్ నిల్వ 11 శాతం నుంచి 44 శాతం వరకు తగ్గినట్టు వారు నిర్వహించిన సర్వేలో తేలింది. కనుక ఎంత సేపు వాకింగ్ చేశారు అన్న దానికంటే ఎప్పుడు నడిచారు అన్న దానికే ప్రాధాన్యత ఇవ్వమంటున్నారు ఎక్సపర్ట్స్. ముఖ్యంగా రాత్రి తిన్న తర్వాత పది నిమిషాలు నడిచిన వారిలో షుగర్ 22 శాతం తగ్గిందని అధ్యయనాలు నిరూపించాయి.