ఎత్నిక్ గానూ స్టయిల్ గానూ వుండే డ్రెస్సింగ్ ఎపుడూ కలర్ కాంబినేషన్ పైనే ఆధారపడి వుంటుంది. ఒకప్పుడు నిండు రంగు చీరల అందం అని ఉండేది. వెంకటగిరి కోయంబత్తుర్ గుంటూరు జరీ నేత చీరలు ఇవన్నీ గాఢమైన రంగుల్లోనే వుండేవి ఇప్పుడు బోల్డ్ కలర్ఫుల్ వస్త్రధారణ అందరూ మెచ్చుకుంటున్నారు. చిలకపచ్చ కుర్తీలు బంగారు ప్రింట్స్ సింపుల్ గా వుండే తెల్లని చుడీదార్లు నేటి ఫ్యాషన్ పోకడలు. బీజ్ రెడ్ కాంబినేషన్లు పార్టీలు ఫంక్షన్ వేర్ గా ఉంటాయి. నలుపు ఎప్పటికీ ఫెవరెట్ కలర్. ఎలాంటి కలర్ టెక్చర్ పర్సనాలిటీ గలవారైనా బ్లాక్ డ్రెస్ వేసుకోవచ్చు. దుప్పట్టాలా విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుంటే చాలు. లేస్ వెరైటీస్ చక్కని జరీ పని తనం ఉండేవి. హెవీ లుక్ వుండేవి అయితే ఎలాంటి డ్రెస్ కయినా నిండుతనం ఇచ్చేస్తాయి. ఒక బ్లవుజ్ స్టయిలే ఏ నెక్ బావుంటాయి అన్న సందిగ్ధం అసలొద్దు. ఫ్యాషన్ జోన్ లో ఒక్కటి వెనక్కిపోతూ ముందుకొస్తూ ఉంటాయి. ప్రాచీన కాలం నాటి డ్రెస్ లు మోడ్రన్ వస్త్రశ్రేణి తో రూపకల్పన చేస్తే అదే అసలైన ఫ్యాషన్ ట్రెండ్. .
Categories