Categories
Soyagam

బంగారు రంగు పక్షి రెక్కల్లా

కొత్తగా ఏదైనా చేద్దామనే యువతకు స్పూర్తిగా ఉంటుందని ఈ న్యూస్. ఇలాగే ఏ ఫ్యాషనో, సక్సెస్ ఫుల్ ఈవెంటో ప్లాన్ చేసుకొంటే పేరు తెచ్చుకోవడం ఎంతసేపు. ఇదిగో ఫెదర్ ఐబ్రోస్ ట్రెండ్ అని ముద్దుగా పిలుస్తున్న ఈ కొత్త ఐబ్రోస్ మేకప్ ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అచ్చు పక్షి ఈకల్లా ఐబ్రోస్ ను తీర్చి దిద్దుకొని స్టెల్లా అనే మేకప్ ఆర్టిస్ట్ ఇలా వెరైటీ కనుబొమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. పోనీ ఊరుకుందా అంటే ఫ్యాషన్ ప్రేమికులు ఎవరైనా ఉంటే తనలా కొత్తరకంగా కనుబొమ్మలు అలంకరించుకొని ట్యాగ్ చేయండి అని పోస్ట్ చేసింది. ఇంకేముందీ ఈ ఫెదర్ ఐబ్రోస్ ఇప్పుడు నయా ట్రెండ్. లక్షల కొద్దీ క్లిక్స్, వేల ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు అమ్మాయిలు. సరదా వుంటే చూడచ్చు బంగారు రంగుల పక్షి రెక్కలాంటి నల్లని ఈ కళ్ళ అందాల కనుబొమ్మల సౌందర్యాన్ని.

Leave a comment