Categories
WhatsApp

పిల్లల్లో నిద్రలేమి తో అనారోగ్యం.

పిల్లలు చాలా సమయం టి.వీ.ల ముందు, స్మార్ట్ ఫోన్ లతో ఆటలాడుతూ సరిగా నిద్ర పోకుండా వుంటే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. నిద్ర సరిగా సరిపోకపోతే శరీరంలో కణాల వయసు తగ్గిపోతుందిట. క్రోమోజోముల అంచుల్లో  వుండే టెలోమర్ల  పొడవు మనిషి వయసుని బట్టి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ పొడవు కుంచించుకుపోతుంది. దీని ఆధారంగా సరిగ్గా  నిద్ర చాలని లేదా నిద్ర పట్టడం లేదని కప్లయింట్ ఉన్న పిల్లల్ని పరిశోధించారు. నిద్రపోని పిల్లల్లో  టెలోమర్లను పరిశీలిస్తే వాటి పొడవు నిద్ర లేమితో తొందరగా కుంచించుకుపోవడం కనిపెట్టారు. అందువల్ల  పెద్దయిన కొద్దీ వాళ్ళలో వార్ధక్యం కారణంగా వచ్చే మతిమరుపు, గుండె జబ్బు వంటివి చాలా చిన్న వయసులోనే రావచ్చునని హెచ్చరిస్తున్నారు. పిల్లలు నిద్రకు సమయం ఇచ్చేలా చూసుకోమంటున్నారు.

Leave a comment