మనం తినే పండ్ల జాబితాలో బొప్పాయి తప్పనిసరిగా వుండి తీరాలంటారు ఎక్స్పర్ట్స్. ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.. బొప్పాయి పండు ఎ సి విటమిన్లు మంచి ఆధారం చిన్న బొప్పాయిపండు ముక్క తిన్న విటమిన్ సి లో 150 శాతం లభించినట్లే. తక్కువ క్యాలరీలు కొవ్వు కొలెస్ట్రాల్ ఉండదు . పొటాషియం ఫోలేట్ పీచులకు మంచి ఆహారం. అత్యధిక విటమిన్లు పోషకాల వల్ల బొప్పాయి రోగనిరోధిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొంచెం చిరు చేదుగా వుండే బొప్పాయి గింజల్లోనూ చాలా ప్రయోజనాలుంటాయి. యాంటీ ఇన్ఫలామేటరీ యాంటీ పారసైట్ ఎనాల్జేస్టిక్ గుణాలు కలిగి ఉంటాయి మాంసం త్వరగా ఉడకటానికి పచ్చి బొప్పాయిని వేలాది సంవత్సరాలుగా వాడుతున్నారు. బొప్పాయి ఆకులకూ ఇప్పుడు డిమాండ్ ఎక్కువగానే ఉంది. డెంగ్యూ సోకినవారికి బొప్పాయి ఆకుల రసం బాగా పనిచేస్తుంది. ప్లేట్ లెట్స్ పెంచటంలో ఈ రసం ఉపయోగపడుతుంది. బొప్పాయి ఆకులలో యాంటీమేటేరియల్ యాంటీ కాన్సర్ గుణాలు ఉన్నట్లు అధ్యయన కారులు గుర్తించారు. ఇందులో వుండే పాపెయిన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియలు బాగా సహకరిస్తుంది. తప్పకుండా బొప్పాయి డైలీ డైట్ లో వుంచుకోవాల్సిందే.
Categories