Categories

రూపా మెహతా, 7 వర్కవుట్స్ ఫర్ 7 మూడ్స్ అనే విషయంపైన నలినీ మెథడ్ అనే పుస్తకం రాశారు. ఒక పనిపై శ్రద్ధ పెట్టాలంటే దానికి సంబంధించిన డ్రెస్ వేసుకోవాలి, సమయానికి బద్దకం లేకుండా లేవాలి. వేసుకొన్న డ్రెస్, లెగ్గింగ్స్‌తో మనలో మనకే ఒక సూపర్‌స్టార్‌ననే ఫీలింగ్ కలుగుతుందట. వ్యాయమం చేయాలంటే నేనంత చేస్తే అంత అందంగా ఉంటాను అనే ఆత్మ విశ్వాసాన్ని శరీరం మొత్తం నింపివేయాలి. అలాగే జిమ్‌కి వెళ్లే టైమ్ లేకపోతే ఇంట్లో చిన్న జిమ్ని ఏర్పాటు చేసుకోవాలి. కానీ జిమ్‌కి వెళ్లలేదు అనే భావనతో ఉండకూడదు. నేనలాగైనా ఈ వర్కవుట్ చేస్తానని మూడ్ తెచ్చుకోవాలట. పుస్తకం అంతా ఇలాంటి టిప్సే వున్నాయి. కొన్ని పుస్తకాలను ప్రేమిస్తే మంచి జరుగుతుంది.