ఆన్‌లైన్‌లో వేదింపులు ఎదుర్కొనేవారి కోసం ఫేస్‌బుక్‌ సరికొత్త టూల్‌ ప్రవేశపెట్టింది. ఇది ఆకతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు పరిమితం కాలేదు. ఈ టూల్‌లో సమస్యకు కారణాలు, నివారణ మార్గాలు వాటిని ఎదుర్కొనే పద్దతులు ఉంటాయి. బుల్లీయింగ్‌ ప్రివెన్షన్‌ హబ్‌ (BPH) అనేది ఈ టూల్‌ పేరు. ఫేస్‌బుక్‌లో సపోర్ట్‌ ఇన్‌బాక్స్‌లో ఇప్పటికే ఉన్న సేఫ్టీ సెంటర్‌లో ఇటీవలే దీన్ని ఏర్పాటు చేశారు. ఫేస్‌బుక్‌ తన ఖాతాదారులకు కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్ల గురించి ఇందులో ఉంటుంది. బుల్లీయింగ్‌ వివరణ, సూచనలు ఇంగ్లీష్‌, తెలుగుతో పాటు 50 భాషల్లో ఉన్నాయి. అందురు ఫేస్‌బుక్‌లోనే ఉన్నారు కనుక ఓ సారి ఈ టూల్‌ని చూడండి.

Leave a comment